Thursday, December 8, 2022

తరలివచ్చిన వైద్యారోగ్య సిబ్బంది.. కళకళలాడిన కళాభవన్​

ఏఎన్‌ఎంలు రెండో మహాసభలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మంత్రి హరీశ్​రావు. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్‌ఎంలదే కీలక పాత్ర అని చెప్పారు. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌ అన్న నానుడిని అమలు చేయడంలో ఏఎన్‌ఎంలదే ముఖ్యమైన పాత్ర అని స్పష్టం చేశారు. బీపీ, షుగర్‌, కేన్సర్ వంటి మొండి వ్యాధులు ఉన్నట్లు చాలా మందికి తెలియదని, వాటిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని ఏఎన్‌ఎంలకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు పెద్ద ఎత్తున ఏఎన్​ఎంలు తరలిరావడంతో హైదరాబాద్​ కళకళలాడింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement