Friday, March 29, 2024

డ్రాగా ముగిసిన మలేషియా, స్పెయిన్‌ మ్యాచ్‌.. హాకీ ప్రపంచకప్‌

హాకీ ప్రపంచ కప్‌లో భాగంగా భువనేశ్వర్‌ రూర్కెలా వేదికగా మలేషియా, స్పెయిన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2తోడ్రాగా ముగిసింది. తొలి రెండు క్వార్టర్స్‌లో ఇరు జట్లు ఎలాంటి స్కోర్‌ చేయలేకపోయాయి. మూడో క్వార్టర్‌లో మాత్రం మలేసియా ఒక గోల్‌ చేయగా స్పెయిన్‌ 2 గోల్స్‌ చేసి ఖాతా ఆరంభించాయి. ఒక గోల్‌తో స్పెయిన్‌ ఆధిక్యంలో వచ్చింది. మలేసియా ఆటగాడు సారీ ఫైసల్‌ 34వ నిమిషం వద్ద తొలి గోల్‌ కొట్టి శుభారంభం ఇచ్చాడు.

స్పెయిన్‌ ఆటగాడు మిరల్లేస్‌ మార్క్‌ 40వ నిమిషం వద్ద పిఎస్‌ గోల్‌ కొట్టాడు. 41వ నిమిషంవద్ద స్పెయిన్‌ ఆటగాడు గిస్పర్ట్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టాడు నాలుగో క్వార్టర్‌లో మలేషియా ఒక గోల్‌ చేయగా స్పెయిన్‌ ఎటువంటి స్కోర్‌ చేయకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో మలేషియా మూడు షాట్‌ ఔట్లు చేయగా స్పెయిన్‌ 4 షూట్‌ ఔట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement