Tuesday, April 16, 2024

మాటిచ్చి.. మరిచిపోయారా.? పెగాసెస్‌పై దర్యాప్తు ఆపండి.. దీదీ ప్రభుత్వంతో సుప్రీం

సుప్రీం కోర్టు నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో రూపొందించిన స్పైవేర్‌ పెగాసెస్‌పై దర్యాప్తు కోసం ప.బెంగాల్‌ ప్రభుతం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌ నేతృత్వంలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేసింది. తాజాగా సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ పెగాసెస్‌ స్పైవేర్‌పై దర్యాప్తు చేయడాన్ని తప్పుబట్టింది. తమకు ముందుగా ఇచ్చిన హామీకి భిన్నంగా నడుచుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ కమిషన్‌ దర్యాప్తుపై స్టే విధించింది. ఈ అంశం దేశ రాజకీయాలను కుదిపేసింది. వ్యక్తిగత గోప్యత హక్కును హరించి పౌరులపై నిఘా వేస్తున్నదని కేంద్రంపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ పంచాయితీ సుప్రీంకు చేరింది. ఎన్‌జీఓ గ్లోబల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ పెగాసెస్‌పై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీల ధర్మాసనం విచారిస్తున్నది. ఈ అంశంపై దర్యాప్తునకు ధర్మాసనం సతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.

లోకూర్‌ కమిషన్‌ దర్యాప్తుకు బ్రేక్‌
ప.బెంగాల్‌ ప్రభుతం కూడా దర్యాప్తునకు ఎంబీ లోకూర్‌ సారథ్యంలో కమిషన్‌ వేయగా.. దీని దర్యాప్తుపై సుప్రీం స్టే విధించింది. ఏంటిది ఇది.. చివరి సారే మీరు మాకు మాట ఇచ్చారు. పెగాసెస్‌పై ఎలాంటి దర్యాప్తు చేపట్టబోమని చెప్పారు కదా.. మళ్లిd మీరు ఎంక్వైరీ స్టార్ట్‌ ఎందుకు చేశారు..? అంటూ బెంగాల్‌ తరఫు న్యాయవాది ఏఎం సింఘీని సీజేఐ రమణ ప్రశ్నించారు. దీనిపై సింఘ్వీ స్పందిస్తూ.. తాను కమిషన్‌ తరఫున వాదించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్నా అని అన్నారు. అయితే కోర్టు ఆదేశాలను కమిషన్‌కు తెలిపామన్నారు. పెగాసెస్‌పై సుప్రీం తీర్పు వెలువడే వరకు దర్యాప్తు చేయబోమని, ఆ తరువాతే మాజీ జస్టిస్‌ ఎంబీ లోకూర్‌ సారథ్యంలో కమిషన్‌ దర్యాప్తు జరుపుతుందని స్పష్టత ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement