Thursday, April 25, 2024

రైల్వే ప్రయాణికుల భద్రతే ఆర్‌పీఎఫ్‌ ప్రధాన లక్ష్యం-దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రైల్వే ఆస్తులను సంరక్షించడంతో పాటు ప్రయాణికులకు భద్రత కల్పించడమే ఆర్‌పీఎఫ్‌ ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం పేర్కొంది. రైల్వే ఆస్తుల సంరక్షణపై, ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతూ రాష్ట్ర పోలీస్‌, ఇతర చట్టపరమైన సంస్థలతో సమన్వయం ఏర్పర్చుకొని 2022లో మంచి పనితీరును ప్రదర్శించామని తెలిపింది.”మిషన్‌ జీవన్‌ రక్ష” కింద ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది తమ జీవితాలను పణంగా పెడుతూ మార్చి 2022లో 21 మందిని రక్షించినట్లు పేర్కొంది. ”ఆపరేషన్‌ నాన్హే ఫరిస్తే” కింద వివిధ కారణాల వల్ల వారి కుటుంబం నుండి తప్పిపోయిన, విడిపోయిన 93 మంది పిల్లలను గుర్తించి వారికి రక్షణ కల్పించినట్లు వెల్లడించింది. ”ఆపరేషన్‌ అమానత్‌”లో భాగంగా రూ.42 లక్షలకు పైగా విలువగలిగిన 192కు పైగా వస్తువులను స్వాధీనం చేసుకొని ప్రయాణికులకు క్షేమంగా అందజేసినట్లు ఆర్‌పీఎఫ్‌ వివరించింది.

రైల్వే ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆర్‌పీఎఫ్‌ ”ఆపరేషన్‌ నార్కోస్‌” ప్రారంభించిందని, ఇందులో భాగంగా మార్చి 2022లో రూ.7.50 లక్షలకు పైగా విలువగల మాదకద్రవ్యాల ఉత్పత్తులను జప్తు చేసి, ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపింది. ”ఆపరేషన్‌ డిగ్నిటీ” కింద భద్రత మరియు రక్షణ అవసరమైన నిరాశ్రయులను, నిస్సహాయకులను, మానసిక స్థితి సరిగా లేనివారిని, అక్రమంగా రవాణా చేయబడుతున్న పెద్దలను ఆర్‌పిఎఫ్‌ గుర్తించి సంరక్షించి, వారిని వారి కుటంబాలకు అప్పచెప్పిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement