Saturday, October 12, 2024

డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా రానున్న ది కేర‌ళ స్టోరీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే..

చిన్న సినిమాగా విడుదలై ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ సినిమా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ద్విగ్విజయంగా దూసుకుపోతూ.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా, ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ మూవీ జీ5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించదానికి రెడీగా ఉంది. జూన్ 23వ తేదీ నుండి ఈ చిత్రం జీ5లో ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో తీసుకురానున్నారు. అదా శర్మ, సిద్ది ఇద్నానీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement