Thursday, April 18, 2024

దేశంపై పెరుగుతున్న రుణ భారం.. 2024లో 16 లక్షల కోట్ల అప్పులు

కేంద్రం చేస్తున్న అప్పులు ఏటా భారీగా పెరుగుతున్నాయి. 2020-24 ఆర్ధిక సంవత్సరంలో రికార్డ్‌ స్థాయిలో ప్రభుత్వం 16 లక్షల కోట్లు అప్పులు చేయనుంది. ప్రముఖ ఆర్ధికవేత్తలతో రాయిటర్స్‌ జరిపిన పోల్‌ ప్రకారం ఈ అంచనా వేశారు. మౌలిక సదుపాయాల వ్యయం, ఆర్ధిక క్రమశిక్షణ అనేది బడ్జెట్‌లో ప్రాధాన్యతలుగా ఉండాలని ఆర్ధికవేత్తలు సూచించారు. కోవిడ్‌ మహమ్మారి ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పేదలకు ఉపశమనం కల్పించేందుకు భారీగా ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ స్థూల రుణ భారం రెట్టింపు అయ్యింది.

ఇదే చివరి పూర్తి బడ్జెట్‌..

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి రానున్నది ఎన్నికల సంవత్సరం. అందువల్ల ఈ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ అవుతుంది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలు సైతం ఉన్నాయి. ఈ దశలో ఫిబ్రవరి 1న కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఎలా ఉండనుందన్న దానిపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కొవిడ్‌ తరువాత ఆర్ధిక వ్యవస్థలు మందగించడం, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల ఆదాయంపై ప్రభావం చూపవచ్చు. రుణాలు తగ్గించుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం అంత తేలికేమీకాదు.

- Advertisement -

పెరుగుతున్న రుణభారం..

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశం రుణ భారం భారీగా పెరుగుతూ వస్తోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం 14.2 లక్షల కోట్లు అప్పు చేసింది. ప్రముక ఆర్ధికవేత్తల అంచనా ప్రకారం 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వవం 16 లక్షల కోట్ల అప్పులు తీసుకోనుంది. 2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశం వార్షిక రుణాలు 5.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉన్నందున ఏటా రుణ భారం పెరుగుతుందని ఏఎన్‌జడ్‌ ఆర్ధికవేత్త ధీరజ్‌ నిమ్‌ అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ తరువాత ప్రభుత్వం వివిధ అవసరాలకు భారీగా రుణాలు తీసుకుంది. రుణాలు తిరిగి చెల్లించే భారం ఏటా పెరుగుతున్నది. వీటిని చెల్లించడానికి మళ్లిd రుణాలు తీసుకుంటున్నారు. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో రుణాలు తిరిగి చెల్లించేందుకే 4.4 లక్షల కోట్లు అవసరం అవుతాయని నిమ్‌ అంచనా వేసింది. ప్రత్యేక రాయిటర్స్‌ పోల్‌లో ఎక్కువ మంది ఆర్ధికవేత్తలు ప్రభుత్వం 2023-24 ఆర్ధిక సంవత్సంరలో లోటును జీడీపీలో 6.0 శాతానికి తగ్గించగలని అంచనా వేశారు.

అయినప్పటికీ ఇది 1970 నుంచి చూస్తే సగటు 4 నుంచి 5 శాతం కంటే ఎక్కువగా ఉందని, లక్ష్యానికి దూరంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. 2025-26 నాటికి జీడీపీలో లోటును 4.5 శాతానికి చేరుకుంటుందని వీరు తెలిపారు. కొవిడ్‌ కంటే ముందున్న దానితో పోల్చితే లోటు రెట్టింపు అయ్యింది. వడ్డీ రేట్లు పెరగడం వల్ల కూడా రుణాల చెల్లింపు భారంగా మారుతున్నది. దీర్ఘకాలంలో అప్పులు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి భారత్‌ ఆర్ధిక ఏకీకరణ కోసం మరింత ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక అవసరమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ప్రస్తుత ప్రణాళిక ప్రస్తుతానికి మాత్రమే సరిపోతుందని స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్రాల మొత్తం రుణభారం వార్షిక స్థూల జాతీయోత్పత్తిలోలో 83 శాతానికి సమానం. ఇది అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా ఎక్కువగా ఉంది. ఆర్ధికలోటు, ప్రభుత్వ రుణాల గరిష్టస్థాయిలో ఉన్నందున వృద్ధికి తోడ్పడాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌ ఆర్ధిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకోవాలని ఆర్ధికవేత్తలు సూచించారు.

వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ మూలధన వ్యయం రికార్డ్‌ స్థాయిలో 8.85 లక్షల కోట్లకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతానికి సమానమని ఆర్ధికవేత్తలు అంచనా వేశారు. ఇటువంటి వ్యయంతో గత మూడు సంవత్సరాల్లో వృద్ధి సగం వేగంతో మందగిస్తుందని తెలిపారు. చైనాకు ప్రత్యామ్నాయంగా తయారీ రంగాన్ని వృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయలను పెంచడానికి పుష్కలంగా ప్రభుత్వ నిధులు అవసరం.. వచ్చే బడ్జెట్‌ ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని పోల్‌లో ఆర్ధికవేత్తలను ప్రశ్నించినప్పుడు 36 మందిలో 18 మంది ఆర్ధిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయలపై పెట్టబడులు పెంచాలని సూచించారు. మరో 18 మంది మాత్రం ఉద్యోగ కల్పన, విద్య, ఆరోగ్య సంరోణ, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను 3.7 లక్షల కోట్లకు తగ్గించనుందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఇది గతంలో 5 లక్షల కోట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement