Friday, March 29, 2024

వామన్ రావు హత్య కేసులో సిబిఐ దర్యాప్తు అవసరం లేదు :హైకోర్టు

హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హత్య కేసును హైకోర్టు నేరుగా పర్యవేక్షిస్తోందని హై కోర్ట్ దర్మానసం తెలిపింది. వామన్‌రావు తండ్రికి ఉన్న బాధే కోర్టుకు కూడా ఉందని హై కోర్ట్ తెలిపింది. హత్య కేసు దర్యాప్తు సరైన దిశలోనే సాగుతోందని హైకోర్ట్ తెలిపింది. ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తే సమయం వృథా అవుతుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరోవైపు ఇప్పటి వరకు 25 మంది సాక్షులను విచారించామని కోర్ట్ కి పోలీసులు తెలిపారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసిన‌ట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, సిసిటీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్‌కి పంపించామని అన్నారు. అలాగే మూడు ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులను గుర్తిస్తున్నామ‌న్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.ఇక తదుపరి విచారణను ఏప్రిల్‌ 7కు కోర్ట్ వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement