Tuesday, April 23, 2024

స‌ల్మాన్ ఖాన్ ని చంప‌డ‌మే జీవిత ల‌క్ష్యం.. గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ మ‌రోసారి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని బెదిరించాడు. స‌ల్మాన్ ని చంపడమే తన జీవిత లక్ష్యమని హెచ్చ‌రిస్తూ ఈమెయిల్ పంపాడు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్. సల్మాన్ టీం నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌పై కేసు నమోదు చేశారు. సల్మాన్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడైన ప్రశాంత్ గుంజాల్కర్ ఈ బెదిరింపు ఈమెయిల్ అందుకున్నారు.

పంపిన వ్యక్తిని రోహిత్ గార్గ్‌గా గుర్తించారు. దీంతో గార్గ్, గోల్డీబ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌పై సల్మాన్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ బాస్ (సల్మాన్ ఖాన్)తో గోల్డ్ బ్రార్ మాట్లాడాలనుకుంటున్నారు. బిష్ణోయ్ ఇంటర్వ్యూను ఆయన చూడాలి. ఒకవేళ చూడకుంటే కనుక చూసేలా చేయండి. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలనుకుంటే సల్మాన్ (గోల్డీబ్రార్‌తో) మాట్లాడాలి. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడాలనుకుంటే కనుక మాకు చెప్పండి. ఈసారి మీకు సకాలంలో సమాచారం ఇచ్చాం. వచ్చేసారి మాత్రం షాక్ అవుతారు అని ఆ ఈమెయిల్‌లో హెచ్చరిక జారీ చేశారు.దాంతో ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement