Tuesday, March 26, 2024

సూర్యప్రభ వాహనంపై పంచాయుధ శ్రీ రామచంద్రుడి వైభవం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు శంకు – చక్రాలు, విల్లు – బాణం, గద, ఖడ్గం పంచాయుధాలను ధరించి, సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు. ఉదయం 8 నుండి 9:30 గంటల వరకు వాహన సేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. ఉదయం 11 గంటల నుండి శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ మోహన్, సూపరిండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రేపు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన ఏప్రిల్ నెల కోటాను రేపు ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement