Friday, March 29, 2024

ది ఘోస్ట్ మూవీ నుండి – వేగం ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్

ది ఘోస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘వేగం’ అనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేశారు. నీలి నీలి సంద్రం.. నింగిలోని మేఘం.. అంటూ సాగిన ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని చూపుతుంది. ఇందులో హీరో నాగార్జున ..హీరోయిన్ సోనాల్ చౌహాన్ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. నాగ్ సూపర్ స్టైలిష్ గా కనిపించగా.. సోనాల్ హాట్ గా ఉంది. ఈ చిత్రాన్ని ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించారు. భరత్ – సౌరబ్ ద్వయం ఈ రొమాంటిక్ మెలోడీకి ట్యూన్ కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ .. రమ్య బెహరా కలిసి ఆలపించారు. కృష్ణ మాదినేని తన సంభాషణ శైలి సాహిత్యంతో అదరగొట్టాడు. విజువల్ గానూ ‘వేగం’ గీతం ఆకట్టుకుంటుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ది ఘోస్ట్’ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్ విక్రమ్ గా నాగార్జున కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్ – అనిఖా సురేంద్రన్ – జయప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ .. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ది ఘోస్ట్’ చిత్రాన్ని అక్టోబర్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement