Thursday, April 25, 2024

ది ఘోస్ట్ చిత్రం నుండి మెలోడీ సాంగ్ ప్రోమో

ప్ర‌వీణ్ స‌త్తారు డైరెక్ష‌న్ లో ది ఘోస్ట్ మూవీలో న‌టిస్తున్నాడు హీరో నాగార్జున‌. ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. శ్రీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహ‌న్ రావు, శ‌ర‌త్ మ‌రార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేకర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘వేగ‌మ్’ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు. వ‌ద‌ల‌క వ‌దిలే ప్రాయం’ అంటూ సాగే మెలోడీయ‌స్ ప్రోమో ఆక‌ట్టుకుంది. భ‌ర‌త్-సుర‌భ్ స్వ‌ర ప‌రిచిన ఈ పాట‌ను కృష్ణ మ‌దినేని ర‌చించ‌గా.. క‌పిల్ క‌పిల‌న్‌, ర‌మ్య బెహ‌రా ఆలపించారు. ఈ ఫుల్ సాంగ్‌ను శుక్ర‌వారం సాయంత్రం 4.05 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌లేషియాలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. ఈ చిత్రంలో నాగార్జున‌కు జోడీగా సోనాల్ చౌహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement