Tuesday, April 23, 2024

ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కొత్త పెనాల్టి నియమాలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ త్వరలోనే కొత్త పెనాల్టి నియమాలను ప్రవేశ పెట్టనుంది. గోల్‌ కీపర్ల దుందుడుకు చర్యలను నియంత్రించడం కోసం రూల్స్‌ను మార్చనుంది. మార్చిలో లండన్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో కొత్త నియమాలకు ఆమోదం తెలపనుంది. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా గోల్‌ కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ తీరును ఫిఫా తీవ్రంగా పరిగణించింది. ఉత్కంఠ రేపిన టైటిల్‌ పోరులో పెనాల్టి షూటౌట్‌కు ప్రయత్నించిన ఫ్రాన్స్‌ ఆటగాళ్లను మార్టినెజ్‌ తన చేష్టలతో దారి మళ్లించాడు. ఫ్రాన్స్‌ ప్లేయర్‌ కింగ్‌ స్లే కొమాన్‌ను, మార్టినేజ్‌ కాసేపు నిరీక్షించేలా చేశాడు.

రిఫరీతో మాట్లాడటమే కాకుండా బంతి పెనాల్టి స్పాట్‌లో ఉందా? లేదా ? అనేది చెక్‌ చేయాలని కోరాడు. అంతే కాదు అరెలిన్‌ చౌమనితో మైండ్‌ గేమ్‌ ఆడాడు. దాంతో ఆ జట్టు పెనాల్టి షూటౌట్‌లో విఫలమైంది. అయితే అర్జెంటినా జట్టు ఫిఫా నియమావళిని ఉల్లంఘించిందని మ్యాచ్‌ అనంతరం ఫిఫా వెల్లడించింది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో అర్జెంటినా 4-2తో ఫ్రాన్స్‌పై గెలుపొందింది. మూడోసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement