Thursday, April 25, 2024

నేటినుంచే ఆసియాకప్‌.. ఆఫ్గాన్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్‌

అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసియాకప్‌కు కసరత్తు పూర్తయ్యింది. శనివారం అప్ఘనాస్తాన్‌ , శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీకి శ్రీకారం చుట్టనుంది. అయితే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా.. హై ఓల్టేజ్‌ సమరం మాత్రం ఆదివారం జరుగనుంది. అదే ఇండియా, పాకిస్తాన్‌ మ్యాచ్‌ . రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగడం లేదు. దీంతో ఐసిసి, ఏసీసీ(ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు పోటీ పడుతున్నాయి. దఅయితే వేదిక ఎక్కడైనా ఈ మ్యాచ్‌లో ఉత్కంఠ, భావోద్వేగాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.
ఇప్పటివరకు అన్ని ఫార్మట్లలో కలిపి ఇండియా, పాక్‌ మధ్య 200 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. గతేడాది జరిగిన టీ 20 వరల్డ్‌ కప్‌లో ఇరు దేశాలు చివరి సారి తలపడ్డాయి.

కానీ ఎప్పుడూ లేని విధంగా వరల్డ్‌ కప్‌లో ఫస్ట్‌ టైమ్‌ పాకిస్తాన్‌ ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు టీమిండియా ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. అయితే షార్ట్‌ ఫార్మట్‌లో మాత్రం ఇప్పటివరకు పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం. 9 మ్యాచ్‌లు ఆడితే టీమిండియా ఆరింటిలో గెలిస్తే , పాక్‌ రెండు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓ మ్యాచ్‌టై కాగా మరో దాంట్లో రిజల్ట్‌ రాలేదు. 2007 టీ 20 వరల్డ్‌ కప్‌లో తొలిసారి ఇండో పాక్‌ పోరు జరిగింది. స్కోరు టై కావడంతో నిర్వహించిన బౌల్‌ అవుట్‌లో ఇండియా విజయం సాధించి మెగా కప్‌ను సొంతం చేసుకుంది.

కోహ్లీ గ్రేట్‌
ఈ ఫార్మట్‌లో పాక్‌పై విరాట్‌కు సూపర్‌ రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్‌ లో 77.75 యావరేజ్‌తో 311 రన్స్‌ చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. పాక్‌ తరపున షోయబ్‌ మాలిక్‌ అత్యధిక స్కోరర్‌ (164)గా ఉన్నాడు. ఇప్పుడు ఆసియాకప్‌లో కోహ్లి బరిలోకి దిగుతుండగా, మాలిక్‌ టీమ్‌కు దూరంగా ఉన్నాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌(5), జడేజా (4) టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు.

కొత్త జెర్సీలతో దర్శనం
ఆసియాకప్‌లో ఇండియా, పాక్‌ కొత్త జెర్సీలతో ఆడనున్నాయి. ఈ మేరకు కొత్త కిట్‌ను ఆవిష్కరించారు. ఇండియా తరపున జడేజా కొత్త జెర్సీలో దర్శనమివ్వగా, పాక్‌ ప్లేయర్లు కూడా కొత్త డ్రెస్‌లతో ఫోటోలకు ఫోజిచ్చారు. ఇక ఈ టోర్నీ కోసం ఇండియా చాలా జాగ్రత్తలు తీసుకుంది. పాక్‌తో పాటు మిగతా టీమ్స్‌ బస చేసే హోటల్‌లో కాకుండా రోహిత్‌ సేన కోసం బీసీసీఐ పామ్‌ జుమేరియా రిసార్ట్‌ను బుక్‌ చేసింది. ద్రవిడ్‌ స్థానంలోకి వచ్చిన వీవీఎస్‌ లక్ష్మణ్‌ .. టీమ్‌ ప్రాక్టీస్‌తో పాటు ప్రత్యేకంగా మీటింగ్‌ కూడా ఏర్పాటు చేశాడు. మరో వైపు హాకాంగ్‌ జట్టు ఆసియాకప్‌ మెయిన్‌ డ్రాకు క్వాలిఫై అయ్యింది.

రోహిత్‌ సేన ఫామ్‌లోనే
గత 10 నెలల్లో టీమిండియా 28 టి 20లు ఆడితే ఇందులో 22 నెగ్గింది. ఐదింటిలో ఓడింది. ఓ మ్యాచ్‌లో రిజల్ట్‌ రాలేదు. న్యూజిలాండ్‌ , వెస్టిండీస్‌ (రెండుసార్లు) శ్రీలంక, ఐర్లాండ్‌పై సిరీస్‌లను గెలిచింది. సౌతాఫ్రికాతో సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. కాబట్టి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో కప్‌ను నిలబెట్టుకోవాలని ఇండియా టార్గెట్‌గా పెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement