Sunday, December 8, 2024

ఒమిక్రాన్​ ఎవరినీ వదలదని ఆ డాక్టర్​.. ఫ్యామిలీని మొత్తాన్ని ఏం చేశాడంటే..

ప్ర‌భ‌న్యూస్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రాణాలు నిలపాల్సిన డాక్టరే ముగ్గురి ప్రాణాలను తీశాడు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్‌లో నివసిస్తున్న డాక్టర్‌ సుశీల్‌ కుమార్‌.. తన భార్య, కుమారుడు, కుమార్తెను హత్య చేశాడు. ముందుగా పదునైన వస్తువుతో భార్య తలపై కొట్టాడు. ఆ తరువాత కొడుకు, కూతురు గొంతు కోసి చంపాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాను డిప్రెషన్‌లో ముగ్గురిని హత్య చేసినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు. ఘటనా స్థలంలో 10 పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కోవిడ్‌ ఇప్పుడు అందరినీ చంపేస్తుందని అందులో రాసి ఉండటం గమనార్హం.

ఒమిక్రాన్‌ ఎవరినీ విడిచిపెట్టదని, ఇక శవాలు లెక్కించాల్సిందే.. నా అజాగ్రత్తతో కెరీర్‌లో ఆ దశలోనే ఇరుక్కుపోయాను. అక్కడి నుంచి బయటకు రావడంత అసాధ్యం అంటూ తన సోదరుడికి ఫోన్‌ మెసేజ్‌ పంపాడు డాక్టర్‌ సుశీల్‌. కంగారుపడ్డ ఆయన సోదరుడు సునీల్‌.. తలుపులు పగులగొట్టి చూడగా.. మృతదేహాలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సుశీల్‌ కుమార్‌.. ఇంద్రానగర్‌లోని డివినిటీ అపార్ట్‌మెంట్‌లో 48 ఏళ్ల తన భార్య చంద్రప్రభతో కలిసి నివాసం ఉంటున్నాడు. రామా మెడికల్‌ కాలేజీ ఫోరెన్సిక్‌ బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. అతని కుమారుడు శిఖర్‌ సింగ్‌ (18), కుమార్తె ఖుషీ సింగ్‌ (16) కూడా అదే అపార్ట్‌మెంట్‌లో కలిసి నివసిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement