Thursday, March 28, 2024

కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. 17న కేటీఆర్ చేతుల మీదుగా..

కరీంనగర్-సదాశివపల్లి మధ్య ఉన్న వరంగల్ రూట్‌లో 194 కోట్ల రూపాయలతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీ వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. కాగా, మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను కలసి ఈ నెల 17వ తేదీన‌ ఈ కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి రావలసిందిగా ఆహ్వానించారు. దీంతో కేటీఆర్ ఒకే చెప్ప‌డంతో ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ క్ర‌మంలో ఈ బ్రిడ్జిని 17న కెటిఆర్ జాతికి అంకితం చేయనున్నారు.

పర్యాటకులకు తియ్యని అనుభూతిని పంచి… మనస్సులను దోచుకునేందుకు క‌రీంన‌గ‌ర్ కేబుల్ బ్రిడ్జి సిద్దమవుతోంది. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలిచి… పర్యాటక శోభను పంచనుంది. ఇలాంటి కేబుల్ బ్రిడ్జీ హౌరా, ముంబైలలో రెండు ఉండగా… దక్షిణ భారతంలోనే తొలిసారి దేశంలో 3వ కేబుల్ బ్రిడ్జీ క‌రీంన‌గ‌ర్‌లో నిర్మాణమవుతోంది. అత్యంత ఆధునికంగా సుందరంగా నిర్మాణమవుతున్న ఈ కేబుల్ బ్రిడ్జీ.. ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7కిలోమీటర్ల దూరాన్ని తగ్గించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement