Wednesday, April 17, 2024

జిమ్ ల నుంచే కరోనా… జామ్ జామ్

ప్రతి ఒక్కరికి శరీరాకృతిపై ఆసక్తి పెరిగింది. ఇందుకను గుణంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఫిట్నెస్ కేంద్రాలు, జిమ్ లు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్కం పెనీలు వీటిని పట్టణాలు, నగరాల వారీగా నెలకొల్పాయి. కోవిడ్ నేపధ్యంలో దేశవ్యాప్తంగా అమలైన లాక్ డౌన్ వీటి క్కూడా వర్తించింది. లాక్ డౌన్ ఉపసంహరణ నిబంధనల కనుగుణంగా ఒక్కొక్కటిగా ఈ జిమ్ లు, ఫిట్నెస్ సెంటర్లుతిరిగి తెరుచుకున్నాయి. ఇప్పుడు దేశంలో కోవిడ్ తిరిగి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే మహరాష్ట్రలో తిరిగి లాక్ డౌన్అమలుచేయాల్సిన దుస్థితి నెలకొంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో కూడా దీని ఉనికి తీవ్రం గానే ఉంది. ఉత్తర భారత రాష్ట్రాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ దశలో ప్రధాని మోడి బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాలు కోవిడ్ నియంత్రణకు అమలు చేస్తున్న చర్యలపై ఆయన సమీక్షించారు. దేశంలో కోవిడ్ రెండో దశ మొదలైందని, త్వరలో మూడో, నాలుగో దశలు కూడా వచ్చేస్తున్నాయంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా భారత్ లో సెకండ్ వేవ్, థర్ట్ వేవ్, ఫోర్త్ వేల్‌చ్చే అవకాశాల్లేవంటూ మరి కొన్ని వీడియోలు గమనంలో ఉన్నాయి. దేశంలో పేరెన్నికగన్న వైద్య నిపుణులు ప్రజలకు ఈ మేరకు హామీలిస్తున్నారు. అయితే వీటిలో అసలువెన్నో.. ఫేక్ వెన్నో తెలీని పరిస్థితి సాధారణ జనంలో నెలకొంది. ఓ వైపు కోవిడి పై జరుగుతున్న ప్రచారం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో పరస్పర విరుద్ధంగా వెలుగుచూస్తున్న వీడియోలు అయోమయం కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

కోవిడ్ విస్తరణకు అవకాశాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని వీరు హెచ్చరిసున్నారు. ఈ జాబితాలో ఫిట్‌నెస్ సెంటర్లు, జిమ్ లు అగ్రభాగానున్నాయి. సింగపూర్ లో తిరిగి కోవిడ్ విస్తరిస్తున్న నేపధ్యంలో సమగ్ర అధ్యయనం నిర్వహించారు. ఏ ఏ ప్రాంతాల్నుంచి వ్యాధి ఎక్కువమందికి సోకుతోందంటూ నివేదికలు సిద్ధం చేశారు. ఆ దేశంలో లాక్ డౌన్ అనంతరం మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, జిమ్ లు, ఫిట్నెస్ సెంటర్లు కూడా తిరిగి తెరుచుకున్నాయి. వీటన్నిటిలో నిత్యంజనం రద్దీగానే ఉంటున్నారు. అయితే మిగిలిన వాటితో పోలిస్తే ఫిట్‌నెస్ సెంటర్లు, జివ్ కోవిడ్ వైరస్ ఎక్కువ సమయం జీవించి ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. సినిమా థియే టర్లు, మాల్స్, విద్యాసంస్థల కంటే ఫిట్‌నెస్ సెంటర్ల ద్వారానే తిరిగి కోవిడ్ విస్తరిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ కేంద్రాలు పూర్తిగా ఎయిర్ కండిషనింగ్ చేయబడుంటాయి. ఇందులో శరీరాకృతి మలచుకునే క్రమంలో ఉఛ్వాస నిశ్వాసాల్ని బలంగా తీస్తారు. ఒక కోవిడ్ సోకిన వ్యక్తి తెలీకుండానే ఈ కేంద్రానికొచ్చి వ్యాయామం చేస్తే అతని నోరు, ముక్కుల్నుంచి కోట్లాది వైరస్ క్రిములు ఆ ప్రాంతంలోకి వెదజల్లబడతాయి. ఇవి సుమారు 24 గంటల పాటు జీవించే ఉంటాయి. సదరు వ్యక్తి వినియోగించిన పరికరాలతో పాటు లేదా అతని శ్వాస, గొంతులోంచి వెలుపలికొచ్చిన వైరస్ ఆ తర్వాత అక్కడికొచ్చిన వారం దరికీ సోకుతుంది. వార్నుంచి తిరిగి మరికొందరికికోవిడ్ విస్తరిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగపూర్ లో ఫిట్నెస్ కేంద్రాలు, జిమ్ ను మూసేశారు.ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌనకు ముందు జిమ్ లు, ఫిట్నెస్ కేంద్రాలకు వెళ్ళేవారి సంఖ్యతో పోలిస్తే లాక్ డౌన్ అనంతరం వాటిని వినియోగిస్తున్న వారి సంఖ్య మూడోవంతుకు పడిపోయింది. స్పోర్ట్స్ రివ్యూ సైట్, రన్ రిపీట్ డాట్ కామ్ దీనిపై ఓ సమగ్ర సర్వే నిర్వహించింది. లాక్ డౌనకు ముందు ఫిట్‌నెస్ సెంటర్ల వినియోగంతో పోలిస్తే ఆ తర్వాత వినియోగం 30.98 శాతానికి పడిపోయింది. గరిష్టంగా ఆస్ట్రేలియాలో మాత్రమే 52.80శాతం మంది తిరిగి జిమ్ లు, ఫిట్‌నెస్ సెంటర్లకు హాజరౌతున్నారు. అదే అమెరికాలో అయితే తిరిగి హాజరౌతున్న వారి సంఖ్య 29.28 శాతం మాత్రమే.

బ్రిటన్లో 21.76శాతం, కెనడాలో 39.23 శాతం మంది మాత్రమే తిరిగి ఫిట్నెస్ సెంటర్లను వినియోగిస్తున్నారు. గతనెల్లో 116 దేశాలకు చెందిన 1,10,824 మంది ఫిట్నెస్ కేంద్రాల వినియోగ దార్లతో వర్చువల్ విధానంలో ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 46.67 శాతం మంది జిమ్ లు తిరిగి తెరిచిన తర్వాత తామక్కడకు వెళ్ళలేదని పేర్కొన్నారు. 86.57శాతం మంది తమ సభ్యత్వాల్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. కాగాసర్వేలో పాల్గొన్న వారిలో 55.29శాతం మంది తిరిగి ఫిట్నెస్ కేంద్రాలకెళ్ళాలని భావించడం లేదని చెప్పుకొచ్చారు. అవి కోవిడ్ విస్తరణ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నా యని అభిప్రాయపడ్డారు. భారత్ లో కోవిడ్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లపై నిర్ణయాలెలా ఉన్నా ముం దుగా ఫిట్ నెస్ సెంటర్లు, జిమ్ లను మూయించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. లేనిపక్షంలో దేశంలో మహమ్మారి మరింత విగేంగా విస్తరించే ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా సరిహద్దుల్ని మూసేసింది. ఇతర దేశాల్నుంచి విమానాల రాకపోకల్ని నిషేధించింది. టాంజానియా మొత్తం లా డౌన్ప్రకటించింది. బ్రెజిల్ఘోరమైన దుస్థితిలో మునిగిపోతోంది. స్పెయిన్ మార్చి నెలాఖరు వరకు అత్యవసర పొడిగింపును అమలు చేస్తోంది. యూకే నెలరోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఫ్రాన్స్రెండువారాలు, జర్మనీ నాలుగువారాలు, తాజాగా ఇటలీ కూడా లాక్ డౌన్ల జాబితాలో చేరాయి. 1917లో వచ్చిన స్పానిష్ స్లూ రెండో దశ మొదటి దశ కంటే కూడా ఎక్కువ మంది మరణాలకు దారి తీసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని వీరు నొక్కి చెబు తున్నారు. ఎక్కువగా విస్తరణకవకాశాలున్న జిమ్ లు, ఫిట్నెస్ సెంటర్ల నుంచి నియంత్రణ ప్రారంభించాలని ఉద్బోధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement