Saturday, April 20, 2024

రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది : మంత్రి ప్రశాంత్ రెడ్డి

నిజమాబాద్ : రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది మంత‌రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. ఎంఆర్జిఎస్ కింద కల్లాలు కట్టుకుని రైతులు లబ్ధిపొందుతుంటే కేంద్రం కొర్రిపెట్టింద‌ని, రూ.151 కోట్లు తిరిగి ఇవ్వాలని లేఖ రాసింద‌న్నారు. రోడ్ల మీద ధాన్యం పోసుకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయ‌ని కల్లాల నిర్మాణం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కానీ రైతులను పట్టించుకోకుండా కేంద్రం డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తోంది. రైతుబంధు 57 వేల కోట్లు, రైతు భీమా, ధాన్యం కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని ఆదుకుంటుంది. రూ.1ల‌క్షా 7వేల కోట్లు ధాన్యం కొనుగోలు, విద్యుత్ రూ.36 వేల కోట్లు, రూ.10 వేల 500 కోట్లు ఉచిత విద్యుత్, లక్షన్నర కోట్లు ప్రొజెక్టులకు ఖర్చు చేశారు. 8 ఏళ్లలో రూ.3 లక్షల కోట్లు కేవలం వ్యవసాయం కోసం ఖర్చు, ఇతర రాష్ట్రాల్లో చేపలు పట్టుకుని ఆరబెట్టడానికి ఎస్ఆర్ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. రాష్ట్రంలో మాత్రం రైతుల కల్లాలు కట్టకుండా అడ్డువేస్తున్నారు. వీటిని నిరసిస్తూ శుక్రవారం నాడు పాత కలెక్టరేట్ చౌరస్తా వద్ద రైతుల మహాధర్నాకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement