Thursday, April 25, 2024

ఎమ్మెల్యేల‌కు ఎర కేసు, హైకోర్టు స్టే ఎత్తివేత.. పోలీస్‌ కష్టడీకీ ముగ్గురు నిందితులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ల ఎర కేసులో దర్యాప్తుపై గతంలో ఇచ్చిన స్టేను రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పోలీసులు ఈ కేసును దర్యప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. అటు ఈ కేసును సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని బిజెపి కోరగా.. ఆ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తెరాస ఎంఎల్‌ఏలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గతంలో మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసిబి కోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేయగా దీనిపై వాదనలను విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చిల్లకూరి సుమలత నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మెయినాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ఉన్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. దర్యప్తును నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను హైకోర్టు మంగళవారం నాడు రద్దు చేసింది. ఎంఎల్‌ఏలకు ఎర కేసులో భారతీయ జనతా పార్టీ నేత ప్రేమేందర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై ఇరు పక్షాల వాదనలు జరుగుతున్న సమయంలోనే మొయినాబాద్‌లో నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తు పై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని ప్రేమేందర్‌ రెడ్డి పిటిషన్లో కోరారు. మంగళవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా కేసు దర్యాప్తు నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఎంఎల్‌ఏలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు మొయినాబాద్‌ పోలీసులకు మార్గం సుగమమైంది.

సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణ పురోగతిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందు కుమార్‌, సింహాచలంలను పోలీస్‌ కష్టడీకి కోరే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement