Friday, March 29, 2024

తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు…ఏపీ సర్కార్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ఫ్యూలను కూడా విధిస్తున్నారు. అయితే తాజాగా కరోనా కట్టడికి చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై దుష్ప్రచారాలు అరికట్టేందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు వ్యక్తుల పై చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనుంది. ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ… వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వారిపై కేసులు పెడతామని హెచ్చరించింది. విపత్తు సమయంలో దుష్ప్రచారాలు ను తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement