Friday, March 29, 2024

చైనా మాకు మిత్ర‌దేశ‌మేన్న తాలిబన్..!!

ఆఫ్ఘ‌న్ అంత‌ర్గ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌పై తాలిబ‌న్లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  చైనా దేశం ఆఫ్ఘ‌నిస్తాన్‌కు మిత్ర‌దేశంగా భావిస్తున్నామ‌ని, షిన్‌జీయాంగ్ ప్రావిన్స్‌లో వేర్పాటువాద ఉఘ‌ర్ ముస్లీంల‌కు తాము మ‌ద్ధ‌తు ఇవ్వ‌బోమ‌ని తాలిబ‌న్లు చైనాకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘ‌నిస్తాన్ పున‌ర్నిర్మాణంలో చైనా పాత్ర కూడా ఉండాల‌ని తాము కోరుకుంటున్నామ‌ని తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి సుహైల్ ష‌హీన్ తెలిపారు.  ఇక చైనా మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న ఉఘ‌ర్ ముస్లీంల‌ను త‌మ దేశంలోకి అడుపెట్ట‌నివ్వ‌మ‌ని తాలిబ‌న్ నేత హామి ఇచ్చారు. ఇక ఆఫ్ఘ‌న్‌లో ఉగ్ర‌వాదుల తీరు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్‌లోని అనేక ప్రాంతాల‌ను త‌మ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబ‌న్లు కాంద‌హార్‌ను సొంతం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.  ఆఫ్ఘ‌న్‌లో ఉన్న 210 చైనీయుల‌ను చైనా గ‌త‌వారం వెన‌క్కి తీసుకెళ్లింది.  

ఇది కూడా చదవండి: వింబుల్డన్ ఫైనల్స్ లో అట్రాక్షన్ గా ప్రియాంక చోప్రా..

Advertisement

తాజా వార్తలు

Advertisement