Friday, October 4, 2024

TG – కెటిఆర్ కు వైర‌ల్ ఫీవ‌ర్ – 36 గంట‌లుగా బాధ‌ప‌డుతున్నానంటూ ట్విట్

వైద్యుల సూచ‌న‌తో ఇంటి వ‌ద్దే చికిత్స‌
త్వ‌రలోనే హైడ్రా బాధితుల‌ను క‌లుస్తాన‌ని హామీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడుతన్న ఆయన వైద్యుల సూచన మేరకు యాంటీ వైరల్‌, యాంటీ బయాటిక్స్‌ మందులు వాడుతున్నారు. త్వరలోనే కోలుకుంటానని ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ వెల్లడించారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బాధితుల కుటుంబాలు తరలివచ్చాయి. కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామనుకున్నారు. కానీ హైడ్రా బాధితు వద్దకు కేటీఆర్‌ రాలేకపోయారు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తాను అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను వివరించారు. 36 గంటలుగా బాధపడుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

‘36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నా. వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్ మందులు వాడుతున్నా. త్వరలో కోలుకుంటా. తెలంగాణ భవన్‌కి వస్తున్న హైడ్రా బాధితులకు పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుంది.’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement