Monday, October 7, 2024

TG | సీఎం సహాయ నిధికి సింగ‌రేణి భారీ విరాళం !

తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా చాలా నష్టం జరిగింది. ఈ క్రమంలో వరద బాధితులకు సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్నారు. తాజాగా వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి సంస్థ అధికారులు, ఉద్యోగులు ముందుకొచ్చారు.

తమ ఒకరోజు బేసిక్‌ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు (గురువారం) సచివాలయం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎం బలరాం, ఇంధనశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు సీఎం రేవంత్‌కు విరాళం చెక్కును అందజేశారు. తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement