Friday, November 15, 2024

TG – హైద‌రాబాద్ పై రేవంత్ క‌క్ష‌ … ప్ర‌తీకారంతోనే హైడ్రాతో కూల్చివేత‌లు – కెటిఆర్

ఒక్క సీటు కూడా రాలేద‌ని అసూయ‌

లోకల్ ,నాన్ లోకల్ అంటూ రేవంత్ చెత్త రాజ‌కీయం
హైద‌రాబాద్ లో ఉన్న వాళ్లంద‌రూ మా వాళ్లే
పిఎసి ప‌ద‌వీ కోసం అరికాపూడి కాంగ్రెస్ లోకి జంప్
ఆయ‌న కేమో పోలీస్ ఎస్కార్ట్…
మా వాళ్ల పైన దాడులు, గృహ‌నిర్భంధాలు
రేవంత్ పై విరుచుకుప‌డ్డ కెటిఆర్

హైదరాబాద్ – హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ప్రాంతీయతత్వంపై దాడులు గతంలోనూ లేవని ఇప్పుడూ ఉండవని అన్నారు. బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌ ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. అమెరికా నుంచి హైద‌రాబాద్ చేరుకున్న కెటిఆర్ నేడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు.. కొన్ని రోజులుగా జ‌రుగుతున్న వివాదంపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.. అనంత‌రం పార్టీ అన్ని విధాల అండ‌గా ఉంటుంద‌ని కౌశిక్ కు భ‌రోసా ఇచ్చారు..

చేత‌కాని ముఖ్య‌మంత్రి వ‌ల్లే దాడులు..

- Advertisement -

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అరికాపూడి గాంధీ అనుచరులు పోలీస్ ఎస్కార్ట్ తో త‌మ‌ ఎమ్మెల్యే పై దాడి కి వచ్చారన్నారు. పదేండ్ల లో ఎప్పుడు ఈ రకమైన దాడులు జరగలేద‌ని అన్నారు.. చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నార‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరగకుడని పని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.

రేవంత్ ది చిల్ల‌ర రాజ‌కీయం

అరికాపూడి గాంధీకి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి మా వాళ్ళను హౌజ్ అరెస్ట్ చేశార‌ని మండిప‌డ్డారు కెటిఆర్ . ప్రాంతీయ తత్వం ను చిల్లర ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పదేండ్లు హైదారాబాద్ ప్రశాంతంగా ఉంది.హైదారాబాద్ లో త‌మ‌కు అత్యధిక సీట్లు ఇచ్చార‌ని,..అందుకే రేవంత్ హైదారాబాద్ ప్రజల మీద కక్ష పెట్టుకున్నార‌ని ఆరోపించారు.. హైదారాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగ పట్టి. అందుకే హైడ్రా పేరిట కూల్చుతున్నార‌ని మండిప‌డ్డారు రేవంత్.

ఢిల్లీకి 22 సార్లు వెళ్లావ్… ఏం పీకావ్

22 సార్లు డిల్లి కి ఇక్కడికి రేవంత్ తిరిగార‌ని, .ఏమి పికడానికి వెళ్ళారని నిల‌దీశారు. . హైదారాబాద్ లో శాంతి భద్రతల కంట్రోల్ లో లేవన్నారు. అరికాపూడి గాంధీ ఏ పార్టీ లో ఉన్నావు చెప్పాల‌ని డిమాండ్ చేశారు కెటిఆర్… పార్టీ మారిన అని చెప్పిన నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పండని రేవంత్ ను నిల‌దీశారు..మీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులతో చాలా మందితో కొట్లాడామన్నారు. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుతో కొట్లాడినం నువ్వెంత బుల్లబ్బాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి ప్రోత్సాహం ఇచ్చిన పోలీస్ ల మీద కోర్టుకు వెళుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.

ఆ ప‌దవి కోసం కాంగ్రెస్ లో చేరావా.

దిక్కుమాలిన పీఏసీ పదవి కోసం కాంగ్రెస్ లో చేరావా అంటూ అరికాపూడి గాంధీని కెటిఆర్ ప్ర‌శ్నించారు.. తాజాగా తాను బిఆర్ఎస్ లోనే అంటుంటే నిజ‌యోక‌వ‌ర్గ ప్ర‌జ‌లే న‌వ్వుకుంటున్నార‌ని అన్నారు.. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే గాంధీ ఏపార్టీలో ఉన్నాడో చెబుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లో హేడ్ లైన్ మేనేజ్మెంట్ నడుతుందన్నారు. అసమర్థుడు జీవన్ యాత్ర లాగా పాలన నడుస్తుందని తెలిపారు. వంద రోజులలో అన్ని చేస్తామని చెప్పారు చేయలేదన్నారు.

ఉద్యోగాలు లేవు… రుణ‌మాఫీ కాదు..

2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల రుణమాఫీ మహిళలకి 2500 ఇస్తామని చెప్పి రాష్ట్రం లో అన్ని వర్గాలనీ రేవంత్ మోసం చేశారన్నారు కెటిఆర్ . బీఆర్ఎస్ నాయకులకు సమాధానం చెప్పలేక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల కాళ్ళు ఏళ్ళు పట్టుకుని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారన్నారు. 10 మంది ఎమ్మేల్యేలు వచ్చారు మిగతా వాళ్ళు కూడా వస్తారని కాంగ్రెస్ నేతలు అన్నారని తెలిపారు. పిరయింపు దారుల పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్నారు. పిరాయింపు చట్టం కిందికి వస్తుందని పార్టీ మారిన ఎమ్మేల్యేలు భయపడుతున్నారని తెలిపారు. పిరాయింపు దారుల పై చర్యలు తీసుకోవాలని కెపి వివేకానంద గౌడ్,కౌశిక్ రెడ్డి స్పీకర్ కు పిర్యాదు చేశారన్నారు. పిరాయింపు దారుల పై హై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పిరాయింపు దారులను రాజీనామా చేయమని చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లను రాళ్ల తో కొట్టి చంపoడని రేవంత్ రెడ్డి చెప్పార‌ని గుర్తు చేశారు కెటిఆర్. .. రేవంత్ రెడ్డి మాట్లడినట్టుగా మా నాయకులు మాట్లాడలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement