Wednesday, November 6, 2024

TG – సేఫ్టీ మోకులతో గీత‌కార్మికుల‌కు పూర్తి ర‌క్ష‌ణ – పొన్నం

చెట్టు నుంచి ప‌డిపోయార‌నే మాట రావ‌ద్దు
ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ది వేల కిట్ల పంపిణీ
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ బ్యూరో : గీత కార్మికుల‌కు సేఫ్టీ మోకుల‌తో ర‌క్ష‌ణ‌గా ఉంటుంద‌ని, గీత కార్మికుల శ్రేయోస్సు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయ‌మ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గురువారం కరీంనగర్ పట్టణంలోని రామగుండం బైపాస్ రోడ్డులో కాటమయ్య రక్షణ కవచం (సేఫ్టీ మోకుల) పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొన్నారు.

రెండు ల‌క్ష‌ల మందికి కిట్లు

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 1500 కిలోల బరువులను కూడా తట్టుకునే విధంగా ఈ సేఫ్టీ కిట్ల‌ను తయారు చేసిన‌ట్లు తెలిపారు. గీత కార్మికులు తాటి చెట్టు ఎక్కిన వారి ప్రాణాలు రక్షించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మొదటి దశలో హైదరాబాద్ మినహా 100 నియోజకవర్గాల్లో 10 వేల కిట్లు పంపిణీ చేస్తామ‌న్నారు. రిజిస్టర్ అయిన రెండు లక్షల మంది గీత కార్మికులకు కిట్లు పంపిణీ చేస్తున్నామ‌న్నారు.

చెట్టు నుంచి ప‌డిపోయార‌న్న మాట విన‌ప‌డ‌కూడ‌దు

భవిష్యత్ లో తాటి చెట్టు నుండి పడి చనిపోయారని మాట వినపడకూడదన్న ఉద్దేశంతో ఈ కిట్ల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని మంత్రి అన్నారు. శిక్ష‌ణ పొందిన వారందరికీ కిట్లు ఇవ్వాల‌ని సూచించారు. సోషల్ మీడియాలో కాటమయ్య రక్షణ కవచం మీద అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

టూరిజం స్పాట్ గా మానేరు
మానేరు రిజ‌ర్వాయ‌ర్‌ టూరిజం స్పాట్ గా అభివృద్ధి జరగాలని పొన్నం అన్నారు. ఎల్లమ్మ తల్లి బిడ్డగా ఈభూమి కాపాడే బాధ్యత త‌నేదేన‌ని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు ఈ జిల్లాలో మూడు వ‌చ్చాయ‌ని తెలిపారు. హుస్నాబాద్ ,మానకోడూరు , మంథని ల‌కు కాంప్లెక్స్‌లు వ‌చ్చాయ‌ని, ఇందుకు రూ. 180 కోట్లతో భవనాలు నిర్మాణం ,మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శుక్ర‌వారం శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement