Monday, October 14, 2024

TG – బ్యూటీ ఫికేష‌న్ కాదిది… లూటిఫికేష‌న్ ఇది… రేవంత్ కు కెటిఆర్ చురకలు

రేవంత్ లూటీ కోస‌మే మూసి ప్రాజెక్ట్
డిపిఆర్ కూడా లేని ప్రాజెక్ట్ ఇది
ఏకంగా ల‌క్ష‌న్న‌ర కోట్ల ఖ‌ర్చ‌ట‌
హైడ్రా వెనుక రాహుల్ గాంధీ
బుల్ డోజ‌ర్ల‌ను పంపిస్తున్న‌ది అత‌నే
న‌డిపిస్తున్న‌ది మాత్రం రేవంత్ రెడ్డి
మీడియా సమావేశంలో కెటిఆర్ విమ‌ర్శ‌లు

హైద‌రాబాద్ – ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని రేవంత్ రెడ్డికి చురక అంటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . మూసీ ప్రాజెక్టుపై కనీసం ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదన్నారు. సుందరీకరణ కోసం డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నారు.

- Advertisement -

తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, కేవలం డబ్బు కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. బుల్డోజర్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు ఇబ్బందిపడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, రాహుల్ గాంధీ దీని వెనుక ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల పైకి బుల్డోజర్ పంపిస్తున్నారని మండిపడ్డారు. నోట్ల కట్టల కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు పట్టవా? అని నిలదీశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదని అన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు ఈ సీఎం అని కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement