Wednesday, October 2, 2024

TG – కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి..

కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు కి మంత్రి తుమ్మ‌ల విన‌తి
ఢిల్లీలో కేంద్ర‌మంత్రిని క‌లిసిన మంత్రి
సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని నేడు ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

ఇది ఇలా ఉంటే కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గ‌త ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. నాటి ప్రభుత్వం టెక్నో ఎకనామిక్ ఫీజ్‌బిలిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. గతంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయ భూములకు సంబంధించి సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సైతం సానుకూల నివేదిక ఇవ్వడంతో జిల్లా ప్రజల చిరకాల కోరికగా ఉన్న విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement