Sunday, October 13, 2024

TG – ఆ భవనం ఎందుకు కూల్చారు – వివరణ కోరుతూ హైడ్రాకు హైకోర్టు నోటీసు

అమీన్‌పూర్‌ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్‌ సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

అమీన్‌పూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్‌ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు.. నేరుగా లేదా ఆన్‌లైన్‌ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement