Thursday, October 3, 2024

TG – గాంధీ హ‌స్ప‌ట‌ల్ వ‌ద్ద టెన్ష‌న్… బిఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ ..

హైదరాబాదులోని గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. ఆసుప‌త్రి లోప‌లికి వెళ్లేందుకు య‌త్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజ‌య్‌, మాగంటి గోపీనాథ్‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌పై అధ్య‌య‌నం చేసేందుకు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ క‌మిటీ స‌భ్యులు గాంధీ ఆసుప‌త్రిని ప‌రిశీలించేందుకు లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్నారు. కాగా, బీఆర్ఎస్ వేసిన క‌మిటీలో వైద్యులైన సంజ‌య్‌, రాజ‌య్య‌, మెతుకు ఆనంద్ స‌భ్యులుగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల అరెస్టుతో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement