Wednesday, December 11, 2024

TG | ప్రజాపాలన-విజయోత్సవాల‌పై సీఎం రేవంత్ సమీక్ష

ప్రజాపాలన-విజయోత్సవాల్లో ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను…. శాఖల వారీగా, విభాగాల వారీగా ప్రజలకు వివరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రజాపాలన-విజయోత్సవాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా డిసెంబరు 9వ తేదీ వరకు ప్రజాపరిపాలన విజయోత్సవాలపై ప్ర‌భుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

- Advertisement -

మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువజన సాధికారతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌త్యేక‌ కార్యక్రమాలు చేపట్టాల‌ని అన్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లోవిజయోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

కాగా, ప్రజాపాలన-విజయోత్సవాల సంద‌ర్భంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. ఈ నెల 19న వరంగల్ వేధిక‌గా 22 జిల్లాల్లో ‘‘ఇందిరా మహిళా శక్తి భవనాల’’కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement