Monday, October 7, 2024

TG – కంటైనర్​లో స్మగ్లింగ్​ – రూ. 2.25 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ఆంధ్ర – ఒరిస్సా ప్రాంతాల నుంచి కంటైనర్ లో గంజాయిని గుట్టుగా తరలిస్తుండగా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మహారాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్ల 25 లక్షలు ఉంటుందని తెలిపారు. వివరాల్లోకి వెళితే .. ఆంధ్ర ‌‌- ఒరిస్సా ప్రాంతం నుంచి గంజాయిని ఓ కంటైనర్​లో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిద్దులోని లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం పట్టుకున్నారు.

ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి గంజాయి మత్తు పదార్థాలకు మహారాష్ట్ర, యూపీలో అధికంగా డిమాండ్ ఉండడంతో సాధారణ సరుకుల రవాణా చేస్తున్నట్టు నమ్మిస్తూ మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుండగా.. తెలంగాణ సరిహద్దుల్లో నిఘా పెట్టి కంటైనర్ లో సంచుల్లో ఉన్న గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ కు ముందు ఎనిమిది మంది నిందితుల ముఠా పైలెట్ పార్టీగా అప్రపతం చేస్తూ వెళ్తున్నారని, వారు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గంజాయి స్మగ్లర్లు కంటైనర్ డ్రైవర్ వసీం, క్లీనర్ ఆర్మాన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement