Friday, April 19, 2024

రెండు రోజుల్లో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు మరో 2-3 రోజుల్లోనే వెలువడే అవకాశం కనిపిస్తోంది. వరుసగా రెండో ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు రద్దు చేయడంతో.. ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-1) ఆధారంగా గ్రేడ్లను కేటాయిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది ఫలితాలు 2-3 రోజుల్లో రానున్నాయి. వీరిలో సుమారు 2 లక్షల మంది 10/10 GPAతో ఉత్తీర్ణులు కానున్నారని సమాచారం. అంటే గత సంవత్సరం కంటే దాదాపు 60 వేల ఎక్కువ మంది ఉన్నారు. కాగా కరోనా కారణంగా గత ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసి గ్రేడ్‌లను కేటాయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement