Friday, March 29, 2024

టెన్నిస్‌ స్టార్‌ జోకోవిచ్‌పై నిషేధం ఎత్తివేత.. ఇక ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు చాన్స్‌

టెన్నిస్‌ స్టార్‌ నోకో జోకోవిచ్‌ వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనున్నారు. అతనిపై ఉన్న మూడేళ్ల విసా నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో వివాదాస్పద రీతిలో జోకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీ పడేందుకు జోకోవిచ్‌ ప్రయత్నించాడు. అ అయితే వ్యాక్సిన్‌ తీసుకోకుండా ఆస్ట్రేలియాలోకి ఎంటర్‌ అయినందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది టోర్నీకి రెండు వారాల ముందు జోకోవిచ్‌ను అరెస్ట్‌ చేసి , ఆ తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టారు. ఆ సమయంలో అతనిపై మూడేళ్ల విసా నిషేధం విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement