Monday, September 25, 2023

Kashmir – ఘోర రోడ్డు ప్రమాదం – పది మంది దుర్మరణం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని జాజ్జర్‌ కోట్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అమృత్‌సర్‌ నుంచి కత్రా వెళ్తున్న బస్సు.. జమ్ము శ్రీనగర్‌ జాతీయ రహదారిపై జాజ్జర్‌ సమీపంలో బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో పది మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement