Thursday, April 25, 2024

శ్రీలంకలో తొలి జాతి తెలుగోళ్లే, మనది సాంస్కృతిక అనుబంధం.. నిపుణుల స్పష్టీకరణ

(న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభానికి గురైన శ్రీలంకకు భారత్‌ ఆపన్నహస్తం అందించడంపై కొన్ని రకాల విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. గతంలో తమిళ టైగర్లు భారత్‌లో పలు విధ్వంసాలకు కారణమయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీని హత్య చేశారు. శ్రీలంకతో దీర్ఘకాలంగా భారత్‌కు విబేధాలున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా శ్రీలంక, చైనా పంచన చేరింది. తన రేవుల్లో ఆయుధ సంపత్తిని మోహ రించేందుకు చైనాకు అనుమతులిచ్చింది. శ్రీలంకలోని కీలక రేవుల నుంచి భారత్‌ వ్యూహాత్మక దూరంలో ఉండడం భద్రతాపరంగా మనల్ని కలచివేసే అంశం. వీటన్నింటిని పరి గణనలోకి తీసుకుని కొందరు శ్రీలంకకు సాయాన్ని అందిం చడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే శ్రీలంకకు భారత్‌తో సుదీర్ఘ సాంస్కృతిక, సంప్రదాయ సంబంధ బాంధ వ్యాలున్నాయి. శ్రీలంక పూర్వీకులు భారత్‌ నుంచి తరలెళ్ళిన వారే. ఉత్తర భారతీయులతోపాటు

తమిళులు కూడా శ్రీలంక నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. వీరేకాదు.. అసలు శ్రీలంకలో రాజ్యాల ఏర్పాటుకు తెలుగు జాతీయులే శ్రీకారం చుట్టారు. ఈ ద్వీపదేశం చరిత్రను పరి శీలిస్తే సుమారు 34వేల ఏళ్ళ క్రితమే ఇది ఆవిర్భవించినట్లు పురావస్తు ఆధారాలున్నాయి. క్రీస్తుపూర్వం 15వేలవ సంవత్సరం నాటికే ఇక్కడ వ్యవసాయం మొదలైంది. ఉత్తర భారత్‌ నుంచి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పలువురు శ్రీలంకకు చేరారు. వారే అంచెలంచెలుగా ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరం నాటికే ఇక్కడ దాల్చిన చెక్కను విరివిగా పండించారు. ఈ చెక్కను అప్పట్లోనే ఈజిప్ట్‌కు ఎగుమతులు చేశారు. ఇప్పటికీ ఈజిప్షియన్‌ పిరమిడ్‌ల లో శ్రీలంకలో పండిన దాల్చినచెక్క అవశేషాల్ని గమనించొచ్చు. క్రీస్తుపూర్వం 250 సంవత్సర సమయంలో బౌద్ధమతం శ్రీలంకకు చేరింది. ఇది తెలుగువారి ద్వారానే శ్రీలంకకెళ్ళింది. బౌద్ధమతానికి చెందిన పాలిగ్రంధంలో దళదవంశం గురించి సవివరంగా ఉంటుంది.

శ్రీలంకలో శ్రీదళిలమాలిగవ అనే ఆలయం అత్యంత ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా పాపకర్మలు తొలగిపోతాయని లంకవాసులు విశ్వసిస్తారు. మనకు తిరుపతి తరహాలోనే ఆ దేశంలో ఈ ఆలయం చాలా మహిమాన్వితమైన దిగా భావిస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఈ ఆలయంలో బుద్ధుడి దంతం భద్రపర్చారు. బుద్ధుడి నిర్యాణం అనంతరం ఆయన ఎడమదంతాన్ని ఖీమగెరా అనే బిక్షువు సేకరించాడు. ఈ దంతాన్ని ఆ బిక్షువు అప్పటి కళింగరాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా ఇచ్చాడు. ఈ దంతానికి గౌరవంగా ఆ రాజు ఓ స్థూపాన్ని నిర్మించా డు. కాలక్రమంలో అదే దంతపురిగా మారింది. ఈ దంతపురిలో బుద్ధుడి దంతం ఉందన్న ప్రచారం పెరిగింది. ఈ దంతం ఎక్కడుంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు, రాజులు విశ్వసించారు. అప్పటి నుంచి ఈ దంతం కోసం తరచూ దంతపురిపై దాడులు జరిగాయి. ఈ దంతాన్ని రక్షించుకునేందుకు ఆ రాజు ఓ పథకాన్ని ఆలోచించాడు. తన కూతురు హేమమాలి, అల్లుడు దంత కుమారుడికి ఈ దంతాన్ని అప్పగించాడు. తండ్రి ఆదేశం మేరకు హేమమాలి తన కొప్పులో దాచుకుంది. రాజ్యంపైకి దండెత్తిన శత్రువుల బారిన పడకుండా ఓ నౌకలో వీరిద్దరూ ద్వీపదేశానికి చేరుకున్నారు. అప్పటికి లంకలో పెద్దగా జనాభా లేరు. అంచెలం చెలుగా దంత కుమారుడే అక్కడ రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.

ఇంతకీ ఈ దంత కుమారుడు, హేమమాలిలకు చెందిన దంతపురి ఎక్కడున్నదన్న పరిశోధనలు జరిగాయి. చివరకు పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస సమీపంలోని దంతపురమే ఇదని రుజువు చేశారు. ఇప్పటికీ అక్కడ ఆనాటి కళింగరాజు నిర్మించిన కోట గోడలున్నాయి. ఇలా అప్పట్లో కళింగ రాజ్య పరిధిలోని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్ళిన హేమమాలి, దంత కుమారులే శ్రీలంకలో రాజ్యాన్ని స్థాపించి విస్తరించుకున్నారు. ఇక్కడి నుంచి తరలించిన బుద్ధుడి దంతాన్ని శ్రీదలిదమాలిగవ ఆలయంలో భద్రపర్చారు. అలాగే వీరు కాండీ పేరిట ఓ నగరాన్ని నిర్మించారు. వీరే కాదు.. అప్పట్లో మధురై ప్రాంతంలోని వడగల్‌ కూడా తెలుగునే ప్రధాన భాషగా మాట్లాడేవారు. చోళుల కాలంలో మధురై నుంచి పలువురు వడగల్‌ శ్రీలంకకు తరలిపోయారు. వీరంతా నాయక రాజవంశీయులు. అనంతర కాలంలో కూడా శ్రీలంక పాలకులు, రాజులు భారత్‌లోని తంజావూరు, మధురై రాచకుమార్తెలను వివాహం చేసుకున్నారు.

శ్రీలంకలో తొలి రాజ్యస్థాపకుడి పేరు విజయుడు. అతడు అప్పట్లోనే అనురాధపుర పేరిట పెద్ద నగరాన్ని నిర్మించాడు. ఈ విజుయుడు కూడా శ్రీకాళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన వాడే. అప్పట్లో ఇదంతా కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. ప్రస్తుత ఒడిశాను ఉత్తరకళింగగా గంజాం జిల్లా నుంచి గోదావరి వరకు మధ్య, దక్షిణ కళింగలుగా పిలిచేవారు. వాస్తవానికి ఈ విజయుడి సొంత గ్రామం సింగపురం పేరిటే అనురాధపుర వాసుల్ని సింగల వారిగా, అనంత రం సింహళ జాతీయులుగా పిలవడం మొదలైందన్న చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీలంకలోని మూలవాసుల్లో తెలుగువారే అధి కం. అనురాధపుర సీగిరియా దంబుల్లా వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ తెలుగే మాట్లాడుతారు. అక్కడింకా వెంకటక్క, సరోజ, మసక్క, మసన్న, సుబ్బడు, ఎర్రన్న, లచ్చిమి వంటి పేర్లు కనిపిస్తాయి. అలా గే తెలుగు మాండలిక పదాల్ని కూడా సింహళీయులు ఎక్కువగానే వినియోగిస్తారు. వాస్తవానికి సింహళీయుల మూలజాతులు తెలు గువారేనని ఆంత్రోపాలజిస్టులు తీర్మానించారు. అలాగే బ్రిటీష్‌ పాల నా హయాంలో కూడా తేయాకు తోటల్లో కూలి పనుల కోసం పెద్దెత్తు న శ్రీలంకకు తరలించారు.

- Advertisement -

అయితే రాన్రాను అక్కడ తమిళుల ఆధి పత్యం పెరిగింది. తెలుగు వారిని కూడా తమలో ఓ భాగంగా తమి ళులు పరిగణించడం మొదలెట్టారు. అయితే శ్రీలంకలో తొలి జాతీ యులు మాత్రం తెలుగువారేనని చరిత్ర చెబుతున్న సత్యం. అలాగే భారత్‌కు శ్రీలంకకు మధ్య విడదీయరాని అనుబంధముంది. పౌరా ణిక కాలం నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు న్నాయి. ప్రస్తుత పాలకులు స్వప్రయోజనాల కోసం చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా వాస్తవానికి శ్రీలంకతో సాంస్కృతి క, సంప్రదాయ సంబంధాల్ని పెనవేసుకున్నది భారతే. ఈ దృష్ట్యా కూడా శ్రీలంకను ఆర్థిక, ఆహార సంక్షోభ సమయంలో ఆదుకోవాల్సి న బాధ్యత భారత్‌కుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement