Friday, April 19, 2024

Live Updates: తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ 4,228 ఓట్లతో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 2,753 ఓట్లతో తర్వాతి స్థానంలో ఉంది. బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. సాగర్ ఎన్నికలో తెరాస నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ పోటీ చేశారు.

సాగర్ ఉపఎన్నికలో 7వ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ 6,592 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 7వ రౌండ్‎లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 4,022 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి 2,607 ఓట్లు,  బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ మంచి మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. 8వ రౌండ్ ముగిసే స‌రికి 7,948 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు.

తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో YCP అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 45,810 ఓట్ల ఆధిక్యంలో గురుమూర్తి ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో గురుమూర్తికి 1,00,744 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 54,934 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 7,590 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్‌లో వైసీపీ ఆధిక్యం కనబర్చడంతో తమ పార్టీ గెలుపు ఖాయమని YCP నేతలు అంటున్నారు.

నాగార్జున సాగర్ ఉపఎన్నికలో 9వ రౌండ్ ముగిసే సరికి 8,111 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజ‌లో ఉన్నారు. తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక ఏడో రౌండ్లో టీఆర్‌ఎస్‌కి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వచ్చాయి. ఎనిమిది రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోలయ్యాయి.

- Advertisement -

తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో మొత్తం 25 రౌండ్లకు గానూ ఆరు రౌండ్ల పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 60వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గురుమూర్తికి 1,47,094, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 85,798, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 12,530 ఓట్లు పోలయ్యాయి.

తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 69,724 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. వైసీపీకి 1,57,951 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 88,677 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 15574 ఓట్లు పోలయ్యాయి.

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో 15వ రౌండ్‌లోనూ 426 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్. 15 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 9,914 ఓట్ల ముందంజలో ఉన్నారు.

నాగార్జున సాగర్లో 16వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 10,158 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు వివరాలు@ 12.50 PM:

వైసీపీ: 2,29,424(55.9 శాతం)
టీడీపీ: 1,33,613(32.5 శాతం)
బీజేపీ: 23,223(5.7 శాతం)
కాంగ్రెస్ : 3,594(0.9 శాతం)
సీపీఎం :2,167(0.5 శాతం)
ఇతరులు : 12,963(3.2 శాతం)
నోటా: 5,644(1.4 శాతం)

తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 95,811ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి ఇప్పటివరకు 2,29,424 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 1,33,613 ఓట్లు వచ్చాయి. బీజేపీ-జనసేన అభ్యర్థి రత్నప్రభకు 23,223 ఓట్లు పోలయ్యాయి. కాగా గురుమూర్తి మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతుండగా.. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement