Thursday, April 25, 2024

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్‌ క్యాలెండర్‌ ను రిలీజ్‌ చేసింది. అకాడమిక్‌ క్యాలెండర్‌ ను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉంటాయని ప్రకటించారు. 47 రోజులు ఆన్‌లైన్ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్‌ డే ఏప్రిల్‌ 23 అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో 10 వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు మళ్లీ వేసవి కాలం సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే దసరా సెలవులు అక్టోబర్‌ 6 నుంచి అక్టోబర్‌ 17 వరకు ఉంటాయన్నారు. జనవరి 11 నుండి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement