Tuesday, March 26, 2024

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్ల ప్రారంభం యథాతథం

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లను పున:ప్రారంభించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలు మూసివేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగతా అన్ని స్కూళ్లలో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించాలని తెలిపింది. సర్కారు తాజా నిర్ణయంతో రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మినహా మిగతా అన్ని పాఠశాలల్లో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి.

కాగా ప్రత్యక్ష బోధన కోసం పాఠశాలలకు రావాలని విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని, అలాగే ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ లేదా ప్రత్యక్ష బోధనపై విద్యా సంస్థలే అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించే పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేయాలని, వారంలోగా మార్గదర్శకాలు విడుదల చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement