Tuesday, November 12, 2024

Exports | ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఏటికేడు బియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండడంతో తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

పిలిప్పైన్స్‌ దేశానికి తెలంగాణ నుండి బియ్యం ఎగుమతిపై కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం బియ్యం ఎగుమతులపై పిలిప్పైన్స్‌ దేశ వ్యవసాయ మంత్రితో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలంగాణ నుండి 3లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వరి ధాన్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. కమిషనర్‌ సివిల్‌ స్లపస్‌ మరియు రంగాలలోని కొంత మంది నిపుణులతో చర్చించిన తర్వాత ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వక , సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి.

నాణ్యత కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్ని ఏళ్లుగా భారతదేశం నుండి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ఆపివేశారని చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బియ్యం గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం సుముఖంగా ఉన్నామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. భారతదేశం నుంచి పిలిప్పైన్స్‌కు బియ్యం ఎగుమతి అంశం కార్యరూపం దాల్చిచే తెలంగాణ నుంచి ఎగుమతి చేస్తామన్నారు.

ఈ అంశంపై త్వరలో తెలంగాణ రాష్ట్రం, పిలిప్పైన్స్‌ మధ్య ఒప్పందం కుదురుతుందని ఇరువురు మంత్రులు ఆకాంక్షించారు. పిలిప్పైన్స్‌ కు బియ్యం ఎగుమతి అంశం సాకారమైతే, తెలంగాణ పౌర సరఫరాల శాఖకు మరో మంచి అవకాశంగా మారుతుందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణ బియ్యం నాణ్యతలో నంబర్‌ వన్‌ అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement