Thursday, September 16, 2021

శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తాం: సీఎండీ ప్రభాకర్‌రావు

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరాన్ని బట్టి శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి చేస్తామని సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుండి తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో వరద అధికంగా ఉందన్న ఆయన.. విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ పూర్తిగా అప్రమత్తంగా ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ , స్తంభాలు అదనంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలకు ఏమైనా విద్యుత్ పరంగా సమస్యలు ఉంటే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 7382072104, 73820 72106 నెంబర్లను అందుబాటులో ఉంచామని సీఎండీ ప్రభాకర్ రావు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News