Wednesday, April 24, 2024

తెలంగాణ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల

తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఈ ఏడాది 220 రోజులు పని దినాలు ఉంటాయని పేర్కొంది. అలాగే రెండు విడతలుగా ఇంటర్ అకడమిక్ ఇయర్ ఉందనున్నట్లు పేర్కొంది విద్యా శాఖ. మొదటి టర్మ్ సెప్టెంబర్ 1 నుండి డిసెంబర్ 18 వరకు ఉంటుందని పేర్కొన్న తెలంగాణ విద్యా శాఖ.. ఈ ఏడాది ఇంటర్‌లో హాఫ్ ఇయర్లీ పరీక్షలు నిర్వహించనుంది.

అలాగే అక్టోబర్ 13 నుండి 17 వరకు దసరా సెలవులు ఉంటాయని.. డిసెంబర్ 13 నుంచి 18 వరకు అర్థ సంవత్సరం పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ పేర్కొంది. డిసెంబర్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు సెకండ్ టర్మ్ ఉంటుందని.. జనవరి 13 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక మార్చి 23 నుండి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు ఉనాటాని తెలిపింది. చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 13వ తేదీ అని పేర్కొంది. ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు ఉంటాయని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement