Thursday, April 25, 2024

జమున హేచరీస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అసైన్డ్‌ భూముల వివాదం వ్యవహారంలో జమున హేచరీస్ ప్రైవేటు లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పిటీషనర్‌ తరపు వాదనలను లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వినిపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ, విజిలెన్స్ విచారణ చేపడుతున్నారని పిటీషనర్ పేర్కొన్నారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లోకి వెళ్లి విచారణ చేపడుతున్నారని తెలిపారు. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందని, తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్‌ పిటిషన్‌లో  కోరింది.

66 ఎకరాలు ఆసైన్డ్ భూమి అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని పిటీషనర్ తరుపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి అన్నారు. పట్టా భూములను కొనుగోలు చేసి జమున హ్యాచరిస్ కంపెనీ పెట్టారని తెలిపారు. ధరణి పోర్టల్ లో కూడా అవి పట్ట భూములని ఉందని చెప్పారు. సాధారణంగా ఏదైనా విచారణ జరిగితే కొన్ని రోజుల పాటు జరుగుతుందని, కానీ ఇక్కడ అత్యoత వేగంగా 24 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. నివేదికలో కలెక్టర్ ఈటెల జమునా w/o నితిన్ అని రాసిన అంశాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాది తెచ్చారు. నివేదిక వేగంగా పూర్తి చేయాలని అత్రుతలో కనీసం జాగ్రతలు తీసుకోకుండా ఇష్టానుసారంగా బంధాలు మార్చేశారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.

కాగా, జమున హ్యాచరీస్‌ భూ వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్‌ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్‌ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో మెదక్‌ జిల్లా అసైన్డ్‌ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్‌ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement