Wednesday, March 27, 2024

అలర్ట్: సెకండ్ వేవ్ ముప్పు ఇంకా ఉందట..?

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి ఇంకా సెకండ్ వేవ్ ముప్పు తొలగలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెచ్చిరిస్తోంది. క‌రోనా సెకండ్ వేవ్‌లో కేసులు త‌క్కువ‌గా న‌మోద‌వుతున్నా, ఇంకా పూర్తిగా నియంత్రలోకి రాలేదని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం.  మొద‌టి వేవ్‌లో ఆల్ఫార‌కం వేరియంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందితే, రెండో ద‌శ‌లో డెల్టావేరియంట్ వ్యాప్తి అధికంగా ఉంద‌ని, సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఈ డెల్టా వేరియంట్ కు వ్యాప్తిచెందే గుణం అధికంగా ఉంద‌ని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. ఇలాంటి స‌మ‌యంలో సెకండ్ వేవ్ తొల‌గిపోయింద‌ని అనుకోవ‌డం పోర‌పాటే అని, త‌ప్ప‌ని స‌రిగా మాస్కులు ధ‌రించాల‌ని తెలియ‌జేసింది.  నిబంధ‌న‌లు ఉల్లంఘించి ప్ర‌వ‌ర్తిస్తే త్వ‌ర‌లోనే మూడోద‌శ కోవిడ్ ముప్పును ఎదుర్కొవాల్సిన ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని ఆరోగ్యశాఖ హెచ్చ‌రించింది. భార‌త్‌లో డెల్టావేరియంట్ మొద‌ల‌యి…ప్ర‌పంచంలోని 115 దేశాల‌ను వ‌ణికిస్తోంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది. తెలంగాణలో కొన్ని గ్రామాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో లాక్ డౌన్ విధించారు. అదేబాటలో మరికొన్ని గ్రామాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : దేశంలో స్థిరంగా కొనసాగుతోన్న కరోనా కేసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement