Wednesday, June 16, 2021

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

తెలంగాణ ఎంసెట్-2021 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుల గ‌డువును అధికారులు మ‌రోసారి పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ వెల్లడించారు. ఎంసెట్‌కు ఇప్పటి వరకు 2,20,027 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. అందులో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌కు 1,46,541, అగ్రికల్చర్‌కు 73,486 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ ఏడాది మార్చి 18న అధికారులు ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. కరోనా వ్యాప్తి కారణంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఇప్పటివరకు ఎంసెట్ దరఖాస్తు గడువును మూడుసార్లు పొడిగించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News