Thursday, April 25, 2024

తెలంగాణ కరోనా అప్డేట్….కొత్తగా 993 కేసులు

తెలంగాణ లో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 993 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 9 మంది కరోనా తో మృతి చెందారు. మరోవైపు 1417 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 6.21 ల‌క్ష‌లు కు చేరింది. ఇక మ‌ర‌ణాలు 3,644కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,869 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా న‌మోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో 124 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement