Thursday, September 16, 2021

ఈనెల 17న గజ్వేల్‌లో కాంగ్రెస్ దండోరా సభ

సెప్టెంబర్ 17న గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ విలేకరుల సమావేశంలో వివరించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలపై సమావేశంలో సమీక్ష నిర్వహించినట్టు మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గజ్వేల్ సభ కంటే ముందు కరీంనగర్‌లో ఓ సభను పెట్టాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై మహేష్ కుమార్ విమర్శలు చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనన్న దానికి ఇది నిదర్శనమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం సీఎం కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని మహేష్ కుమార్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News