Thursday, April 18, 2024

బండి-హరీష్ ల అగ్గిపెట్టె కథ… సిబిఐ విచారణ జరగాల్సిందే!!

హరీష్ రావు అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దుబ్బాక లో అబద్దాలు చెప్పినందుకే హరీష్ రావు వీపు సాఫ్ అయిందని … శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడాదని హెచ్చరించారు. ఉద్యమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదో తెలుసా అని ప్రశ్నించారు. ఆ అగ్గిపెట్టె కోసం ఇంకా వెతుకుతునే ఉన్నాడంటూ హరీష్ పై సెటైర్లు కూడా వేశారు బండి. హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. శ్రీకాంత చారికి దొరికిన అగ్గిపెట్టె .. హరీష్ రావుకు ఎందుకు దొరకలేదని ప్రశ్నించారు.

ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు బండి. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజక్టులను అడ్డుకోవాలని మాత్రమే లేఖ రాశాను. సీఎం కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన అంశాన్ని వదలను. లోకసభ స్పీకర్ కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తాను. కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించిన విషయం బయటకు వచ్చాక సంచలనం అవుతోందని అన్నారు బండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement