Friday, April 19, 2024

దేవుడిపైనే మొత్తం భారం… కేసీఆర్ ఆరోగ్య శాఖ తీసుకోవటంపై విజయశాంతి విమర్శలు

కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సీఎం కేసిఆర్ గారి నిర్వహణలోకి వచ్చిందన్నారు విజయ శాంతి. ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలు ఇంకాస్త భీతిల్లిపోయే పరిస్థితి కనిపిస్తోందన్నారు.ఒక పక్క రాష్ట్రంలో కరోనా కట్టడి తీరుపై దాదాపు రోజువారీగా నడుస్తున్న విచారణలో పాలకులు హైకోర్టు మందలింపులు, హెచ్చరికలకు గురవుతున్నారు. ఇలాంటి దుస్థితిలో అసలు దర్శనం దొరకడమే కష్టంగా మారిన సీఎం గారి చేతికి వైద్య-ఆరోగ్య శాఖ వెళ్ళింది. స్వయంగా ఆయనే కరోనా నిబంధనలు ఉల్లంఘించి కోవిడ్ బారిన పడిన వ్యక్తి. ఆయనతో పాటు కుమారుడు, మంత్రి అయిన కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్… ఇలా గులాబీ దళం నేతలు చాలామంది కరోనాకు గురయ్యారని అన్నారు.

మంత్రులు, ప్రజాప్రతినిధులు, అత్యున్నత స్థాయి అధికారులకు సైతం అందుబాటులో ఉండని కేసీఆర్ చేతికి…. అది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య శాఖ వెళ్ళడం ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ముఖ్యమంత్రి చేతుల్లో పడినందుకు కాపాడమంటూ…. కుచ్ “కరోనా” భగవాన్ అని తెలంగాణ ప్రజలు దేవుడిపైనే భారం మోపి కాలం వెళ్ళబుచ్చుతున్నారనేది ఇప్పుడు కనిపిస్తున్న కఠోర వాస్తవం అంటూ విమర్శలు చేశారు విజయశాంతి.

Advertisement

తాజా వార్తలు

Advertisement