Saturday, September 23, 2023

తహసీల్దార్లకు పదోన్నతులు.. 19మందికి డిప్యుటీ కలెక్టర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ‘సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారీగా తహశీల్దార్ల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తహశీల్దార్లకు డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతుల కల్పనలో భాగంగా 19 మందికి ప్రమోషన్లను వర్తింపజేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌ జీవో వెల్లడించారు.

- Advertisement -
   

డిప్యుటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన వారిలో కె మహేశ్వర్‌, ఎం సూర్య ప్రకాశ్‌, మురళీకృష్ణ, కె మాదవి, పి నాగరాజు, ఎల్‌ అలివేలు, బి శకుంతల, కె సత్యపాల్‌రెడ్డి, పి మాధవీదేవి, వి సుహాసిని, బూక్యా బన్సీలాల్‌, బి జయశ్రీ, ఎం శ్రీనివాస్‌రావు, డి దేవుజా, డి ప్రేమ్‌రాజ్‌, ఐవీ భాస్కర్‌ కుమార్‌, వుప్పల లావణ్య, ఓ చంద్రకళ, ఆర్వీ రాధాభాయిలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement