Wednesday, March 27, 2024

వ్యవసాయంలో టెక్నాలజీ.. బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం

మన దేశంలో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయానిదే అగ్రస్థానం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇంత వరకు నెరవేరలేదు. ఈ రంగంలో ఖర్చు తగ్గించి, ఆదాయం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ దశగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారో అని ఈ రంగంలోని నిపుణులు ఎదురు చూస్తున్నారు.
ఆర్ధిక మాంద్యం భయాలతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. వ్యవసాయంతో ఆధునిక పరిజ్ఞనాన్ని జొప్పించడంలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. ఎన్నికల సందర్భంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో నీటిపారుదల రంగానికి, టెక్నాలజీ, నాణ్యమైన విత్తనాలపై కేటాయింపులు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వసాయానికి రుణాల లభ్యత మరింత పెంచడంతో పాటు, అనుబంధ రంగాల వృద్ధికి తగినంత బడ్జెట్‌ నిధులు కేటాయించాల్సి ఉంది. నాణ్యమైన విత్తనాలు రైతులకు అందేలా బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు పెడతారో చూడాల్సివుంది. కొంత కాలంగా ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ వస్తోంది. వ్యవసాయానికి ముఖ్యమైన యూరియా, డీఏపీ ధరలు భారీగా పెరిగాయి. దీని వల్ల వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్నాయి. అదే సమయంలో రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు రావడంలేదు. దీని వల్ల రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం రంగం సంక్షోభంలోకి కూరుకుపోతున్నది.

రోజురోజుకు నష్టాల్లోకి…

- Advertisement -

వ్యవవసాయ, పశుపోషణ రంగాలకు కీలకమైన డీజిల్‌, విద్యుత్‌, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత 20 నెలల్లో రెండంకెల్లో నమోదవుతోంది. డిసెంబర్‌ 2022 నాటికి ఇది 20.3 శాతానికి చేరింది. అదే జూన్‌లో ఇది 38.5 శాతంగా ఉంది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. అధిక ఉష్ణోగ్రతలు గోధమ పంటను దెబ్బతీశాయి. ప్రభుత్వం రైతుల పంటలకు తప్పనిసరిగా కనీస మద్ధతు ధరను ప్రకటించడంతో పాటు, అవి ఖచ్చితంగా అమలు జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎరువులు, పురుగు మందుల ధరలను అదుపు చేయడంతో పాటు, విత్తనాల ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ చర్యలు తీసుకోకుంటే వ్యవసాయ రంగం రోజురోజకు సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు వీటిని పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితులను గమనంలో ఉంచుకునైనా… ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఆధునీకరణ అవసరమే…

మన దేశంలో ఇంకా వ్యవసాయం సంప్రదాయ విధానంలోనే సాగుతోంది. చాలా దేశాల్లో ఈ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నది. ఈ దిశగా మన దేశంలోనూ వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరగాల్సి ఉంది. అప్పుడే ఖర్చులు తగ్గి, వ్యవసాయం లాభసాటిగా మారేందుకు అవకాశం ఉంది. పంటల దిగుబడిని పెంచడంతో పాటు, నాణ్యతకు పెద్దపీట వేసినప్పుడే మన వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌ పోటీని తట్టుకోగలవు. ఈ దిశగా బడ్జెట్‌లో ఈ సారి ఆర్దిక మంత్రి ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారో చూడాల్సి ఉంది. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తికి, అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది.

వాస్తవానికి మనకున్న భూములు, నీటి వనరులకు సరిగా ఉపయోగించుకుంటే 2031 నాటిటికి 800 బిలియన్‌ డాలర్ల ఆదాయం కేవలం వ్యవసాయ రంగం నుంచే సాధించవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం 270 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ దిశగా ముందడుగు పడాలంటే ప్రభుత్వం వ్యవసాయం రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే విధానాలను తీసుకురావాల్సి ఉంది. ఇందుకు అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాలని ఈ రంగంలోని నిపుణులు సూచించిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకు వచ్చేందుకు 2022 బడ్జెట్‌లోనే కొన్ని ప్రతిపాదనలు చేశారు. కిసాన్‌ డ్రోన్లను ప్రమోట్‌ చేసేలా అగ్రిటెక్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్ట్‌ కింద నిధిని ఏర్పాటు చేసింది. ఈ రంగంలో మరింత ముందుకు వెళ్లాలంటే బ్లాక్చైన్‌ టెక్నాలజీ, కృత్రిమ మేథ, డ్రోన్లు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి ఆధునిక సాంతకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయం రంగంలోనూ వినియోగించేందుకు తగిన ప్రోత్సహకాలు అవసరం. 2023-24 బడ్జెట్‌లో వీటికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో పాటు పన్ను రాయితీలు ఇవ్వాల్సి ఉంది. అగ్రిటెక్‌ రంగంలో ప్రభుత్వ నిబంధనలను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేక పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నష్టాలు తగ్గించాలి…

వ్యవసాయ నష్టాలను తగ్గించేందకు కూడా ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. ఇది పెద్ద సవాల్‌. ముఖ్యంగా పండ్లు, కోడి గ్రుడ్లు, మత్స్య పరిశ్రమలో ఈ నష్టాలు పెరుగుతున్నాయి. వీటిని కనీస స్థాయికి తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ రంగాల్లో 6 శాతానికి పైగా ఉత్పత్తి నష్టం జరుగుతుందని అంచనా. పప్పు ధాన్యాలు, కూరగాయలు, పౌల్ట్రిd రంగాల్లో కూడా ఈ నష్టాలు 4 శాతాని కిపైగా ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలే తెలుపుతున్నాయి. ప్రధానంగా గోదాములు, కోల్డ్‌ స్టోరేజీలు, రవాణా సదుపాయలు పెరిగితే ఈ నష్టాలను తగ్గించడానికి వీలుకలుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తేనే వృధాను అరికట్టి రైతులకు ఆదాయాన్ని పెంచేందుకు వీలుకలుగుతుంది. కనీసం దేశంలోని పెద్ద మార్కెట్‌ యార్డ్‌లన్నింటీలోనూ గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం జరగాల్సి ఉంది. వంట నూనెల దిగుమతులను తగ్గించేందుకు జాతీయస్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ చాలా కాలంగా కేంద్రాన్ని కోరుతున్నది.

అప్పుడే దేశీయంగా వీటి ఉత్పత్తిని పెంచడానికి వదీలు కలుగుతుంది. నూనె గింజల సాగును పెంచేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, రాయితీలు ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో దళారుల ప్రమేయాన్ని ఎంత తగ్గిస్తే, అంత గా రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఏటా 25 వేల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తే వచ్చే 5 సంవత్సరాల్లో వంటనూనెల దిగుమతుల అవసరంలేకుండా దేశీయంగానే మన అవసరాలను తీర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధిని పెంచడానికి దోహదం చేసే పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement