Friday, March 29, 2024

మూన్‌లైటింగ్‌కు టెక్‌ మహీంద్రా ఓకే.. అనుమతి తప్పనిసరి అన్న కంపెనీ

తమ కంపెనీ ఉద్యోగులు ఖాళీ సమయాల్లో ఇతర పనులు చేసుకునేందుకు అనుమతి ఇచ్చేలా మూన్‌లైటింగ్‌ విధానాన్ని రూపొందిస్తున్నామని టెక్‌ మహీద్రా వెల్లడించింది. దీనికి కొన్ని షరతులు ఉంటాయని కంపెనీ సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ తెలిపారు. కంపెనీ నిబంధనలను అనుసరిస్తూ ఇతర ఉద్యోగాలు చేసుకోవడంలో తమకు అభ్యంతరంలేదని ఆయన స్పష్టం చేశారు. టెక్‌ మహీంద్రా 90 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుందని గుర్నానీ చెప్పారు. అన్ని ప్రాంతాల కార్మిక చట్టాలను అనుసరించాల్సి ఉంటుందన్నారు. తమ ఉద్యోగులు ఉత్పాదకతను పెంచుకుంటే సంతోషిస్తామని చెప్పారు. కంపెనీ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉటుందని స్పష్టం చేశారు. వారు ఏం చేస్తున్నారో కూడా కంపెనీకి చెప్పి అనుమతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.

ఇలాంటివిషయాలను దాచిపెట్టడం సరికాదని, అలా చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొత్త నియామకాలను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. భవిష్యత్తుపై ఇన్వెస్ట్‌ చేస్తున్న తాము కొత్త తరాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నామని చెప్పారు. జులై-సెప్టెంబర్‌లో టెక్‌ మహీంద్రా ఏకీకృత ప్రాఇపదికన 1285 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22లో ఇదే త్రైమాసికంలో లాబం 1339 కోట్లతోత పోల్చితే నికర లాభంలో 4 శాతం తక్కువ నమోదైంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10,881 కోట్ల నుంచి 20.7 వాతం పెరిగి 13,129 కోట్లకు చేరింది. జూన్‌ త్రైమాసికంలో 802 మిలియన్‌ డాలర్ల అర్డర్లు లభించగా, ఈ త్రైమాసికంలో ఇవి 716 మిలియన్‌ డాలర్లకు చేరాయి. కొత్తగా 5 వేల మంది ఉద్యోగులను నియమించుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.63 లక్షలకు చేరిందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement